తాజా అప్డేట్
పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ 30 జూన్ 2023. ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ 1 జూలై 2023 నుండి పనిచేయదు.
పాన్ కార్డ్ ఉన్నవాళ్ళందరూ 30 జూన్ 2023లోపు దానిని తమ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలి. పాన్ కార్డ్ కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులందరూ గడువు తేదిలోగా తమ ఆధార్ కార్డ్‌తో దానిని లింక్ చేయడం తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. అయినప్పటికీ, పాన్-ఆధార్‌ను లింక్ చేయమని అభ్యర్థించే ముందు రూ.1,000 ఆలస్య జరిమానా చెల్లించాలి. ఒకవేళ 30 జూన్ 2023లోపు పాన్-ఆధార్ లింక్ చేయనట్లయితే, 1 జూలై 2023 నుండి పాన్ కార్డ్ పనిచేయదు. కాబట్టి, మీ పాన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్‌తో తప్పనిసరిగా లింక్ అయ్యేలా చూసుకోండి.
ఆధార్ కార్డ్ భారతదేశంలోని ప్రతి పౌరునికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా జారీ చేయబడిన ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్యను కలిగి ఉంటుంది. ఇది బయోమెట్రిక్స్ మరియు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వంటి ప్రభుత్వ డేటాబేస్ నుండి కార్డ్ హోల్డర్ వివరాలను యాక్సెస్ చేయడంలో సహాయపడే గుర్తింపు సంఖ్య.
వయస్సు మరియు లింగంతో సంబంధం లేకుండా, భారతదేశంలో నివసించే ఎవరైనా, స్వచ్ఛందంగా ఆధార్ నంబర్‌ను పొందేందుకు నమోదు చేసుకోవచ్చు. నమోదు ప్రక్రియ ఉచితం. ఒక వ్యక్తి నమోదు చేసుకున్న తర్వాత, వారి వివరాలు శాశ్వతంగా డేటాబేస్లో నిల్వ చేయబడతాయి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఆధార్ నంబర్లు ఉండకూడదు.
పాన్ - ఆధార్ లింక్ చేసే తేదీ 31 మార్చి 2022 నుండి 30 జూన్ 2023 వరకు పొడిగించబడింది. అయితే జరిమానా చెల్లించకుండా పాన్ మరియు ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి రోజు మార్చి 31, 2022. కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా పాన్-ఆధార్ లింక్ చేయడం కోసం రూ.1,000 జరిమానా చెల్లించాలి.
మీరు పాన్-ఆధార్‌ను లింక్ చేయకుండా ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేస్తే, పాన్ మరియు ఆధార్ లింక్ అయ్యే వరకు ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌లను ప్రాసెస్ చేయదని గుర్తుంచుకోండి. ఒకవేళ రెండు డేటాబేస్‌లలో ఒకే పేర్లు ఉన్నా లేదా ఏదైనా చిన్న అసమతుల్యత ఉన్నా, ఈ రెండు సందర్భాల్లో రెండు గుర్తింపు కార్డులను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ అధికారిక వెబ్‌సైట్‌ని విజిట్ చేయవచ్చు.
మీ పాన్ మరియు ఆధార్ కార్డ్‌లు లింక్ చేయబడి ఉన్నాయో లేదో మీకు ఖచ్చితంగా తెలియకపోతే, నిర్దారించుకోవడానికి మీరు ఈ కింది విధంగా చేయవచ్చు.
1. ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని విజిట్ చేయండి. హోమ్‌పేజీలో త్వరిత లింక్‌ల క్రింద ఉన్న 'లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి.
2. మీ పాన్ మరియు ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, 'వ్యూ లింక్ ఆధార్ స్టేటస్'పై క్లిక్ చేయండి.
ఇప్పుడు, ఒకవేళ మీ పాన్ & ఆధార్ లింక్ అవ్వకపోతే, క్రింద చూపించిన విధంగా మీకు పాప్-అప్ కనిపిస్తుంది. వాటిని లింక్ చేయడానికి మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వవచ్చు. అలాగే అవి ఇప్పటికే లింక్ చేయబడి ఉంటే, మీరు ClearTax లో మీ ఆదాయపు పన్ను ఫైలింగ్‌ని కొనసాగించవచ్చు .
I. AY 2023-24 కోసం మేజర్ హెడ్ (0021) మరియు మైనర్ హెడ్ (500) కింద NSDL పోర్టల్‌లో ఫీజు చెల్లించండి.
II. ఆధార్-పాన్ లింక్ అభ్యర్థనను సబ్మిట్ చేయండి.
దగ్గర ఉంచుకోవలసిన డాక్యుమెంట్లు:
స్టెప్ 1: పన్ను చెల్లింపు పేజీకి వెళ్లి, నాన్-TDS/TCS వర్గం కింద చలాన్ నంబర్/ITNS 280ని ఎంచుకోండి.
స్టెప్ 2: తర్వాత స్క్రీన్‌లో, హెడ్ '(0021)' ఆ తర్వాత '(500)' ఎంచుకోండి
స్టెప్ 3: చెల్లింపు విధానాన్ని ఎంచుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయండి (మీ పాన్ నంబర్, అసెస్‌మెంట్ ఇయర్ 2023-24 సెలెక్ట్ చేయండి, అడ్రస్ వంటివి)
స్టెప్ 5: చెల్లించిన తర్వాత, పాన్-ఆధార్ లింక్ అభ్యర్థనను సబ్మిట్ చేయడానికి తర్వాతి స్టెప్స్ ఫాలో అవ్వండి. అభ్యర్థనను సబ్మిట్ చేసే ముందు 4-5 రోజులు వేచి ఉండటం మంచిది.
మీరు ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ చేయడం ద్వారా ఆధార్ నంబర్‌ను మీ పాన్‌తో ఆన్‌లైన్‌లో లింక్ చేయవచ్చు. మీరు SMS ద్వారా కూడా చేయవచ్చు. మీ పాన్‌ని మీ ఆధార్‌కి లింక్ చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి:
1. SMS ద్వారా ఆధార్ నంబర్ మరియు పాన్ లింక్ చేయడం
2. మీ ఖాతాకు లాగిన్ అవ్వకుండా లింక్ చేయడం (2-స్టెప్స్ విధానం)
3. మీ ఖాతాకు లాగిన్ అవ్వడం ద్వారా లింక్ చేయడం (6-స్టెప్స్ విధానం)
ఇప్పుడు మీరు మీ ఆధార్ మరియు పాన్‌లను SMS ద్వారా లింక్ చేయవచ్చు. SMS ఆధారిత సదుపాయాన్ని ఉపయోగించి, పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్‌ను వారి పాన్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ కోరింది. ఇది 567678 లేదా 56161కి SMS పంపడం ద్వారా చేయవచ్చు. కింది ఫార్మాట్‌లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 567678 లేదా 56161కి SMS పంపండి:
UIDPAN<SPACE><12 అంకెల ఆధార్>స్పేస్>10 అంకెల పాన్>
ఉదాహరణ: UIDPAN 123456789123 AKPLM2124M
స్టెప్ 1: ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి. త్వరిత లింక్‌ల క్రింద, 'లింక్ ఆధార్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: మీ పాన్ మరియు ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
స్టెప్ 3: పాన్‌ని మరొక ఆధార్‌తో లింక్ చేసిఉన్నట్లయితే, 'పాన్ ఇప్పటికే మరో ఆధార్‌తో లింక్ చేయబడింది' అనే ఎర్రర్ మీకు కనిపిస్తుంది.
ఈ సందర్భంలో, మీరు మీ పాన్ మరొక ఆధార్‌తో లింక్ చేయబడి ఉంటే ఆధార్ మరియు పాన్‌ను అన్-లింక్ చేయడానికి మీరు ఫిర్యాదును దాఖలు చేయవచ్చు లేదా ఇ-ఫైలింగ్ హెల్ప్‌డెస్క్‌ని సంప్రదించవచ్చు.
మీరు మీ పాన్ మరియు ఆధార్‌ని వెరిఫై చేసిన తర్వాత, 3 సందర్భాలు ఉండవచ్చు:
సందర్బం 1: మీరు NSDL (ఇప్పుడు ప్రొటీన్) పోర్టల్‌లో చలాన్‌ను చెల్లించినట్లయితే, చెల్లింపు వివరాలు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో వెరిఫై చేయబడతాయి.
స్టెప్ 1: పాన్ మరియు ఆధార్‌ను వెరిఫై చేసిన తర్వాత, మీకు “మీ చెల్లింపు వివరాలు వెరిఫై చేయబడతాయి” అనే పాప్-అప్ సందేశం కనిపిస్తుంది. 'ఆధార్ లింక్' అభ్యర్థనను సబ్మిట్ చేయడానికి 'కొనసాగించు' అనే బటన్‌ను క్లిక్ చేయండి.
స్టెప్ 2: అవసరమైన వివరాలను నమోదు చేసి, 'లింక్ ఆధార్' బటన్‌ను క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన 6-అంకెల OTPని నమోదు చేసి, వెరిఫై చేయండి.
మీ అభ్యర్థన సక్సెస్ అయింది అనే ఒక మెసేజ్ మీరు స్క్రీన్‌పై చూడవచ్చు. మీరు ఇప్పుడు మీ ఆధార్-పాన్ లింక్ స్థితిని చెక్ చేయవచ్చు.
సందర్బం 2: ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లింపు వివరాలు వెరిఫై చేయబడకపోతే.
పాన్ మరియు ఆధార్‌ని వెరిఫై చేసిన తర్వాత, మీరు "చెల్లింపుల వివరాలు కనుగొనబడలేదు" అనే పాప్-అప్ సందేశాన్ని చూస్తారు. చెల్లింపు విఫలమైతే, అంతకుముందు చూపించిన విధంగా మీరు ముందుగా NSDL పోర్టల్‌లో చెల్లింపును పూర్తి చేయాలి, ఎందుకంటే ఇది పాన్-ఆధార్ లింక్ అభ్యర్థనను సబ్మిట్ చేయడానికి చెల్లించడం అవసరం. అయితే, మీరు ఇప్పటికే NSDL పోర్టల్‌లో రుసుము చెల్లించినట్లయితే, మీరు 4-5 రోజుల తర్వాత మాత్రమే లింక్ అభ్యర్థనను సబ్మిట్ చేయగలరు.
సందర్బం 3: ఒకవేళ పాన్ మరియు మైనర్ హెడ్ కోడ్ 500 రికార్డ్ ఉంది, కానీ లింక్ చేయడానికి చలాన్ ఇప్పటికే తీసుకోబడిఉంటే.
మీ పాన్ మరియు ఆధార్‌ను వెరిఫై చేసిన తర్వాత, “ఈ పాన్ కోసం ఇంతకు ముందు చేసిన చెల్లింపు ఇప్పటికే ఆధార్-పాన్ లింకింగ్ కోసం ఉపయోగించబడింది” అనే పాప్-అప్ మెసేజ్ మీకు కనిపిస్తుంది.
మీరు NSDLలో మళ్లీ రుసుము చెల్లించవలసి ఉంటుంది అలాగే 4-5 రోజుల తర్వాత ఆధార్-పాన్ లింకింగ్ అభ్యర్థనను సబ్మిట్ చేయాలి.
స్టెప్ 1: మీరు ఇప్పటికే రిజిస్టర్ కానట్లయితే, ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి.
స్టెప్ 2: యూజర్ ఐడిని ఎంటర్ చేసి, ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వండి.
స్టెప్ 3 : మీకు సురక్షిత యాక్సెస్ మెసేజ్ వచ్చాక, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి. తర్వాత ప్రాసెస్ కోసం 'కొనసాగించు' మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4: వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత, 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి. మరోప్రక్క, 'నా ప్రొఫైల్'కి వెళ్లి, 'వ్యక్తిగత వివరాలు' ఎంపిక క్రింద 'లింక్ ఆధార్' ఎంచుకోండి.
స్టెప్ 5: ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ సమయంలో సబ్మిట్ చేసిన వివరాల ప్రకారం పేరు, పుట్టిన తేదీ మరియు లింగం వంటి వివరాలను ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఉన్నట్లుగా ఆధార్ నంబర్ మరియు పేరు ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న వివరాలు అలాగే స్క్రీన్‌పై ఉన్న వివరాలు ఒకటేనా అని చూసుకోండి.
'నా ఆధార్ వివరాలను ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను' అనే చెక్ బాక్స్‌ను ఎంచుకోవడం ద్వారా మీ సమ్మతిని తెలియజేయడం తప్పనిసరి.
ఒకవేళ మీ ఆధార్ కార్డ్‌లో పుట్టిన సంవత్సరం మాత్రమే పేర్కొన్నట్లయితే, 'ఆధార్ కార్డ్‌లో నాకు పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంది' అని అడిగే చెక్ బాక్స్‌ను ఎంచుకోండి.
'లింక్ ఆధార్' బటన్‌పై క్లిక్ చేయండి.
6వ స్టెప్: మీ ఆధార్ నంబర్ మీ పాన్ కార్డ్‌కి విజయవంతంగా లింక్ చేయబడిందని పాప్-అప్ సందేశం మీకు తెలియజేస్తుంది.
"పాన్ ఇప్పటికే ERI కోసం ఒక క్లయింట్" అనే EF30032 లోపాన్ని ఎలా పరిష్కరించాలి?
"ఈ పాన్ తేదీ వరకు క్లయింట్‌గా ఉంది" అనే EF500096 లోపాన్ని ఎలా పరిష్కరించాలి?
ERI (ఇ-రిటర్న్ మధ్యవర్తి) అనేది పన్ను చెల్లింపుదారుల తరపున పన్ను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి అధికారం కలిగిన వ్యక్తి లేదా సంస్థ. చాలా ERIలకు పన్ను చెల్లింపుదారుడు క్లయింట్ కాలేరు. మీ PAN ఇప్పటికే ERI కోసం క్లయింట్‌గా ఉన్నప్పుడు (క్లియర్‌ట్యాక్స్ వంటివి), పాన్-ఆధార్‌ని లింక్ చేస్తున్నప్పుడు మీరు ఈ ఎర్రర్‌ను చూస్తారు.
క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు మునుపటి ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీని చాలా ఈజీగా డియాక్టివేట్ చేయవచ్చు:
స్టెప్ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అయ్యి, క్రింద చూపించిన విధంగా డ్రాప్‌డౌన్ నుండి ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీని ఎంచుకోండి
స్టెప్ 2: 'డియాక్టివేట్ చేయి' మీద క్లిక్ చేయండి
స్టెప్ 3: ఎంచుకున్న ERI విజయవంతంగా డియాక్టివేట్ చేయబడుతుంది. మీ మునుపటి ERIని విజయవంతంగా డియాక్టివేట్ చేసిన తర్వాత, మీరు ClearTaxని మీ ERIగా యాడ్ చేసి, ITR ఫైలింగ్ చేయడం కొనసాగించవచ్చు.
EF500058 "ఈ ERIకి PAN చెల్లుబాటు అయ్యే క్లయింట్ కాదు" అనే లోపాన్ని ఎలా పరిష్కరించాలి?
మీ PANని క్లయింట్‌గా నమోదు చేసేటప్పుడు మీరు ఈ లోపాన్ని ఎదుర్కొంటే, దీని అర్థం: ClearTax యొక్క ERI ఐడి మీ ఆదాయపు పన్ను ఖాతాలో డియాక్టివేట్ చేయబడింది లేదా
మీ PAN మరొక ERI యొక్క క్లయింట్‌గా లింక్ చేయబడింది.
లోపాన్ని ఎలా సరిదిద్దాలి?
స్టెప్ 1: మీ ఆదాయపు పన్ను ఖాతాకు లాగిన్ అవ్వండి. అధీకృత భాగస్వాములు >>మై ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీపై క్లిక్ చేయండి. మీరు క్రింద చూపిన విధంగా 'యాక్టివ్' మరియు 'ఇనాక్టివ్' అనే రెండు ట్యాబ్‌లను చూడవచ్చు:
స్టెప్ 2:
ClearTax ERI ERIP000708. యాక్టివ్ ట్యాబ్ క్రింద ఏదైనా ఇతర ERI చూపించబడితే, దానిని డియాక్టివేట్ చేయండి.
ఇనాక్టివ్ ట్యాబ్‌లో ClearTax ERI కనిపిస్తే, 'యాక్టివేట్'పై క్లిక్ చేయండి.
యాక్టివ్ ట్యాబ్‌లో ClearTax ERI కనిపించిన తర్వాత, మీరు ClearTaxలో మీ రిటర్న్ ఫైలింగ్‌ని కొనసాగించవచ్చు.
యాక్టివ్ ట్యాబ్‌లో ClearTax ERI కనిపించకపోతే, మీరు ClearTax లో OTP ద్వారా మీ పాన్‌ను ధృవికరించడం ద్వారా తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి .
మీ పాన్ మరియు ఆధార్ లలో ఉన్న సమాచారం వేరుగా ఉండడం వల్ల అతేంటికేషన్ విఫలమైంది. కాబట్టి మీరు మీ పేరు, పుట్టిన తేదీ అలాగే మొబైల్ నంబర్ వంటి ఇతర డేటా సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేయవచ్చు.
ఆధార్ లింకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి, మీ ఆధార్ కార్డ్ ప్రకారం మీ పాన్ మరియు ఆధార్ నంబర్, మీ పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ వివరాలను ఎంటర్ చేయండి; లింక్ చేయడాన్ని ప్రారంభించడానికి ఆదాయపు పన్ను శాఖ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని పంపుతుంది. పుట్టిన తేదీ వేరుగా ఉంటే, మీరు మీ ఆధార్ కార్డ్ డేటాను అప్‌డేట్ చేయాలి.
మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి మీరు మీ ఆధార్ నంబర్‌ను కోట్ చేయాలి. ఆధార్ నంబర్ లేనప్పుడు, మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను కోట్ చేయాలి.
ఇండియాలో ఉండేవారు మాత్రమే ఆధార్ నంబర్‌ను పొందగలరు. ఆధార్ దరఖాస్తు తేదీకి కొంచం ముందు, మునుపటి 12 నెలల్లో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో ఉన్న వ్యక్తి భారతదేశ నివాసి అవుతాడు. ఒక NRI ఆధార్‌ని పొందాల్సిన అలాగే వారి పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేదు.